డిచ్‌పల్లి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వి. త్రివేణి నియమితులయ్యారు. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా డా. వి. త్రివేణి అందుకున్నారు.
డా. వి. త్రివేణి ఇది వరకు పీఆర్‌ఓగా మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నారు. అదే విధంగా టీయూ కల్చరల్ కో- ఆర్డినేటర్‌గా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా, మహిళా విభాగపు కో- ఆర్డినేటర్‌గా, అసిస్టెంట్ పరీక్షల నియంత్రణాధికారిగా, హాస్టల్ వార్డెన్‌గా తదితర బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు అధ్యయనశాఖకు విభాగాధిపతిగా, పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
తనను తిరిగి పీఆర్‌ఓగా నియమించినందుకు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ కె. శివశంకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. డా. వి. త్రివేణి పీఆర్‌ఓగా నియమింపబడడం పట్ల పలువురు మీడియా మిత్రులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.