డిచ్‌పల్లి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె. లావణ్య నియమింపబడ్డారు. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. ఆమె 2007 జనవరిలో తెలుగు అధ్యయనశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో నియమింపబడ్డారు. ఇక విభాగాధిపతిగా వచ్చే రెండు సంవత్సరాలు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు.
గతంలో ఆమె పరీక్షల అదనపు నియంత్రణాధికారిగా, పబ్లికేషన్ సెల్ డైరెక్టర్‌గా, మహిళా విభాగపు కో – ఆర్డినేటర్‌గా, హాస్టెల్ వార్డెన్‌గా, ప్రస్తుతం లైబ్రరీ ఇంచార్జ్‌గా వివిధ పరిపాలనా బాధ్యలను నిర్వర్తించారు. ఇదివరకు తెలుగు అధ్యయనశాఖ పాఠ్యప్రణాళికా సంఘ చైర్ పర్సన్‌గా కూడా చేశారు.
తనను విభాగాధిపతిగా నియమించినందుకు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. డా. కె. లావణ్య విభాగాధిపతిగా నియమింపబడడం పట్ల పలువురు తెలుగు విభాగపు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.