డిచ్పల్లి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి డా. ఎం. అరుణ తెలిపారు.
మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు మొత్తం 1259 మంది విద్యార్థులు నమోదు కాగా 1217 మంది హాజరు, 42 మంది గైర్హాజరు అయ్యారని ఆమె తెలిపారు. ఏ పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆమె పేర్కొన్నారు.