హరితహారం మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడాలి

నిజామాబాద్‌, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడడం ద్వారా వచ్చే సంవత్సరం అవెన్యూ ప్లాంటేషన్‌ అవసరం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి హరితహారం, ఓమిక్రాన్‌, లేబర్‌ టర్న్‌ ఔట్‌పై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం మన జిల్లాలో జరిగిన ప్లాంటేషన్‌ బాగా ఉందని స్పెషల్‌గా చెప్పడం మీ అందరూ బాగా పనిచేయడం వల్ల ఈ క్రెడిట్‌ దక్కిందన్నారు.

పంచాయతీ సెక్రెటరీ ఫస్ట్‌ ప్రియారిటి హరితహారం ప్లాంట్స్‌ ఆరు నెలలు కష్టపడితే జిల్లాలో ఎవిన్యూ ప్లాంటేషన్‌ వచ్చే సంవత్సరం పరిస్థితి ఉండదన్నారు. ఎవిన్యూ ఇన్స్‌టిట్యూషన్‌ ప్లాంటేషన్‌ బాగా వచ్చిందని నేషనల్‌ హైవే 44. 63 పిఆర్‌ రోడ్స్‌ ఆర్‌ అండ్‌ బి రోడ్లు పంచాయతీ లిమిట్స్‌లో ఉన్న రోడ్‌ జిల్లా డెమో జిల్లా లెవెల్లో మండలం గ్రామపంచాయతీ లెవల్‌లో బాగా పని చేయడం వల్ల అన్నారు.

వందలో 80 శాతం మొక్కలు చూపించే స్థాయిలో ఉండాలని, గట్టిగా వెళ్ళాము కాబట్టి ఈరోజు రిజల్ట్‌ కనబడుతుందన్నారు. మళ్లీ వచ్చే సంవత్సరం ఎవెన్యూ ప్లాంటేషన్‌ ఉండ కూడదని, మల్టీ లేయర్‌ ప్లాంటేషన్‌ చేయాలన్నారు. అటవీశాఖ అధికారులు నేషనల్‌ హైవే మెయింటెన్‌ చేయాలన్నారు. జూన్‌ 30 వరకు ఉన్న మొక్కలకు నీరు పోయగలిగితే వర్షాకాలం వరకు పెరిగిపోతాయని అన్నారు.

క్రిమిటోరియము, డంపింగ్‌ యార్డ్‌ పల్లె ప్రకృతి వనం, ప్రకృతివనం వీటితోపాటు స్కూల్స్‌, ఆఫీసులలో పెట్టిన మొక్కలు ఆరునెలలు కాపాడవలసిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా లేబర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చునని, వన సేవకుని ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. వీటి కోసం గ్రామపంచాయతీలో ప్రాపర్‌గా ఒక రిజిస్టర్‌ మీటింగ్‌ చేయాలని ప్రతి గ్రామ పరిధిలో పంచాయతీ సెక్రెటరీ ప్రొడక్షన్‌ ఆఫ్‌ ప్లాన్స్‌ రిజిస్టర్‌ ఉండాలని, వ్రాయాలని తెలిపారు.

ఒమిక్రాన్‌కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయని, రోజు ఇన్‌ఫెక్షన్‌ రేటు పెరుగుతుందని, గ్రామాలలో ఎక్కువ కట్టడి చేయాలని, జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు క్లియర్‌గా కనిపిస్తుందన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో కోవీడు నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 15 నుండి 18 సంవత్సరాల పిల్లలు మిస్‌ అయిన వారికి వ్యాక్సిన్‌ ఇప్పించాలని వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి వచ్చినా అంతగా ప్రమాదం ఉండదన్నారు.
లేబర్‌ టర్న్‌ఔట్‌ ప్రతి గ్రామంలో 30 నుండి 40 మందికి తగ్గకుండా చూడాలని తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా, డిఎఫ్‌ఓ సునీల్‌, డిఆర్‌డిఓ చందర్‌ నాయక్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »