కామారెడ్డి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం గోదాము నిర్మాణం పనులను జనవరి 31 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న గోదాం పనులను గురువారం ఆయన పరిశీలించారు.
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ రవిశంకర్, డిఈ శ్రీనివాస్, ఏఈ రవితేజ, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.