మాస్‌ కమ్యూనికేషన్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్‌ కమ్యూనికేషన్‌ పరిశోధక విద్యార్థి ఇ. శ్రీనివాస్‌ గౌడ్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. ఆయన రూపొందించిన సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మినీ సెమినార్‌ హాల్‌లో ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో గల రిజిస్ట్రార్‌, సోషల్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఆచార్య కె. శివ శంకర్‌ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఇ. శ్రీనివాస్‌ గౌడ్‌ ‘‘ద కంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ తెలంగాణ డైరెక్టర్స్‌ టు ద తెలుగు సినిమా’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.

ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌ గా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం నుంచి రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె. సుధీర్‌ కుమార్‌ హాజరై పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా రంగంలో తెలంగాణ దర్శకులు బి. నర్సింగరావ్‌, నిమ్మల శంకర్‌, సురేందర్‌ రెడ్డి రూపొందించిన సినిమాలు, తెలంగాణ నేపథ్యం, సినిమా వస్తు నిర్దేశాలను పరిశోధకులు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సినిమా రంగ దర్శకుల మీద జరిగిన మొట్టమొదటి పరిశోధన అని ఎక్సటర్నల్‌ ఎగ్జామినర్‌ పరిశోధకుడిని ప్రశంసించారు.

వైవా వోస్‌కు సోషల్‌ సైన్స్‌ డీన్‌ ఆచార్య కె. శివ శంకర్‌ చైర్మన్‌గా, బిఓఎస్‌ డా. ప్రభంజన్‌ యాదవ్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగపు విభాగధిపతి డా. ఘంటా చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాంట్రాక్ట్‌ డా. మోహన్‌, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి, అదనపుపరీక్షల అధికారి డా. వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ డా. అబ్దుల్‌ ఖవి తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇ. శ్రీనివాస్‌ పిహెచ్‌. డి. సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, కంట్రోలర్‌ డా. అరుణ, విద్యార్థి నాయకులు పిల్లి శ్రీకాంత్‌, పంచరెడ్డి చరణ్‌, యెండల ప్రదీప్‌, పులి జైపాల్‌, ఎల్‌.బి. రవి, సరిత, పుప్పాల రవి, సత్యం తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »