కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కేంద్రంలోని కేర్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై అనురాధ (30) ఏ నెగిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహన్ని గురించి తెలుసుకొని నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి సహకారంతో ఏ నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సులువుగా ఏ రక్తవర్గమైన కామారెడ్డిలో దొరుకుతుందని, ఏ బి, ఏ, బి, ఓ నెగిటివ్ రక్తదాతలు కామారెడ్డిలో ఉన్నారని వారు ఎల్లప్పుడూ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం కామారెడ్డి రక్తదాతలు అని కొనియాడారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, అర్చన, రాజు పాల్గొన్నారు.