వేతన పెంపు ఐక్య పోరాట విజయం

నిజామాబాద్‌, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు 30 శాతం వేతన పెంపును అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు కార్మికులు మిఠాయిలు పంచుకొని విజయోత్సవం జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ జీవో నెంబర్‌ 60 ప్రకారం 30 శాతం వేతన పెంపును జూన్‌ నుండి అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇది మున్సిపల్‌ కార్మిక సంఘాల ఐక్య పోరాట విజయమన్నారు. అన్ని సమస్యలకు పోరాటమే పరిష్కారం అని అన్నారు.

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచాలని రెండు సంవత్సరాలుగా ఐ.ఎఫ్‌.టి.యు ఉద్యమిస్తున్నదన్నారు. గత జూన్‌లో ప్రభుత్వం పిఆర్‌సి ప్రకటించిన తర్వాత జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

ఐ.ఎఫ్‌.టి.యు, ఏ.ఐ.టి.యు.సి, సి.ఐ.టి.యు కార్మిక సంఘాలుగా ఐక్య కార్యాచరణగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించామన్నారు. చలో కలెక్టరేట్‌, చలో హైదరాబాద్‌, వంటావార్పు వంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాల ఫలితమే ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచిందన్నారు. ఐక్య కార్యాచరణ కార్యక్రమాల్లో ఐ.ఎఫ్‌.టి.యు క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు.

ఈ విజయం మున్సిపల్‌ కార్మికుల, కార్మిక సంఘాల ఐక్య పోరాట విజయమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాజేశ్వర్‌, గోవర్ధన్‌, శివకుమార్‌, కిరణ్‌, లక్ష్మీకాంత్‌, వెంకటేష్‌, విటల్‌, శివ, రాము, కళావతి, టి.సుజాత, లక్ష్మి, రజిని, గంగాధర్‌, రమేష్‌, నవనాథ తదితరులు, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »