సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

కామారెడ్డి, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా మున్సిపల్‌ పరిధిలో గల నరసన్న పల్లి శివారులో గల ఇందిరమ్మ ఇళ్లలో పేద ప్రజలకు జీవ్‌ ఆయుర్వేదిక్‌ అనువంశిక వైద్యులు ఎంవీ భాస్కర్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్టు అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు.

ఈ సందర్భంగా శ్యామ్‌ రావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యాక్సినేషన్‌ ప్రతి ఒక్కరు వేయించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వైద్యులు ఎంవీ భాస్కర్‌ని అభినందించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »