కామారెడ్డి, జనవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కుల బహిష్కరణ చేశారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, కామారెడ్డి డిఎస్పీలకు ఫిర్యాదు చేశారు. పెరిక కులానికి చెందిన నల్లపు చంద్రం, నల్ల రాజు, నల్లపు నరేష్ కుటుంబాలను పెరిక సంఘం నుంచి కుల బహిష్కరణ చేశారని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
తమ సొంత భూమి విషయంలో వివాదం జరిగిందని కిస్టయ్య, సముద్రాల సంతోష్ కుటుంబాలకు తమకు భూమి విషయంలో వివాదం జరిగిందని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కులంలో రెండు సార్లు పంచాయతీ జరిగిందని, కుల పెద్దలు బుర్రి లింగం, కానుగంటి నాగరాజు, ఎంపిటిసి, దేవరగట్టు రాజు, కుంచాల శేఖర్, నల్లపు శ్రీనివాస్, ఆశమ్ శెట్టి పోచయ్య, ఆల్లె రవి, పిన్నం రామచంద్రం, బొబ్బసానీ శంకర్ తదితరులు తమని కుల బహిష్కరణ చేశారని ఫిర్యాదు చేశారు.
తమని పెళ్లిళ్లకు శుభకార్యాలకు పిలవడం లేదని ఎవరైనా తమతో మాట్లాడితే జరిమానా విధిస్తున్నారని జిల్లా అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దోమకొండ లో పెరిక సంఘం పెద్దలు తమని అనేక రకాలుగా వేధింపులకు బెదిరింపులకు గురి చేస్తూ కుల బహిష్కరణ చేశారని, వారి ద్వారా తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమని కుల బహిష్కరణ చేసిన విషయం దోమకొండ ఎస్సై సుధాకర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన పట్టించుకోకుండా కుల బహిష్కరణ చేసిన వారికి తొత్తుగా వ్యవహరిస్తూ నిన్నటి రోజున 20 మంది మహిళలను చిన్నపిల్లలను కుటుంబ సభ్యులను రోజంతా దోమకొండ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి బెదిరింపులకు వేధింపులకు గురి చేశారని జిల్లా అధికారులకు దోమకొండలో కుల బహిష్కరణకు గురైన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
దోమకొండ పెరిక సంఘం పెద్దమనుషుల ద్వారా తమ ప్రాణాలకు హాని ఉందని బెదిరింపుల వేధింపుల నుండి కాపాడాలని వ్యవసాయం చేసుకునేలా ఆదుకోవాలని కుల బహిష్కరణ చేసిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.