రైతుబంధు ప్రపంచానికి ఆదర్శం

బాన్సువాడ, జనవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణ కేంద్రం, దేశాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

మొదటగా భాస్కర్‌ రెడ్డి నియోజక వర్గ ప్రజా ప్రతినిదులు, రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు.

రైతుబంధు ఉత్సవాలలో భాగంగా బాన్సువాడ నుండి దేశాయిపేట గ్రామం వరకు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో పోచారం భాస్కర్‌ రెడ్డి రైతులతో కలిసి స్వయంగా ట్రాక్టర్‌ను నడుపుతూ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి భాస్కర్‌ రెడ్డి మాట్లాడారు.

దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజును చేసి, నవతరాన్ని సైతం సాగువైపు మళ్లించేలా స్పూర్తినిచ్చింది ముఖ్యమంత్రి కెసీఆర్‌ అని, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటుతో అన్నదాతకు అండగా ఉన్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం అన్నం పెట్టే అన్నదాత అప్పులపాలు కావద్దని మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాదర్‌, బాన్సువాడ మండల పార్టీ అధ్యక్షుడు, ఆత్మ కమిటీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, బాన్సువాడ సొసైటీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి, బుడ్మి సొసైటి ఛైర్మెన్‌ పిట్ల శ్రీధర్‌, దేశాయ్‌ పేట్‌ గ్రామ సర్పంచ్‌ శ్రావణ్‌, ఎంపీటీసీ రమణ, డీసీసీబీ డైరెక్టర్‌ సంగ్రాం నాయక్‌, మండల నాయకులు దొడ్ల వెంకట్‌ రాం రెడ్డి, గోపాల్‌ రెడ్డి, ఏజాజ్‌, బాన్సువాడ కౌన్సిలర్స్‌, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల రైతులు, దేశాయ్‌ పేట్‌ గ్రామస్తులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »