మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎంపి

కామారెడ్డి, జనవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్‌లో ప్రధాని ఆరోగ్యం బాగుండాలని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏడున్నర సంవత్సరాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని, అలాంటి వ్యక్తిని నడిరోడ్డుపై 20 నిమిషాల పాటు ఉంచిన ఘటనపై అక్కడి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాద్యులైన వారిని బయటకు తీసుకురావాలన్నారు. భగవంతుని ఆశీస్సులు ప్రధాని మోడీకి ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

రాష్ట్రంలో రైతు వారోత్సవాలలో రైతులు లేరని, 2 వేల పింఛన్‌ ఇచ్చి ప్రజలను జీవితం గడపమంటున్నారు, 10 వేలు తీసుకుని కేసీఆర్‌ ఫోటో పెట్టుకొమ్మనటం విడ్డురమని అన్నారు. అకాల వర్షాలకు పసుపు రైతులు ఆగమయ్యారని, ఇప్పటికి ప్రత్యామ్నాయ పంటలపై పటిష్టమైన ప్రణాళిక లేదని వాపోయారు. రైతులు లక్షల్లో నష్టపోతే 10 వేలు ఇచ్చి సంబరాలు చేసుకొమ్మనటమేమిటని ప్రశ్నించారు.

మూడేళ్ళ క్రితం కేంద్రం చెప్తే మూడు గంటల్లో 317 జిఓ తెచ్చారని 317 జిఓ కేసీఆర్‌కు కూడా అర్థం అయిందో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అందుకే మీడియా ముందుకు రావడానికి కేసీఆర్‌ భయపడే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ఏమన్నా అంటే అరెస్టులు వారెంట్లు అంటున్నారని నన్నెందుకు అరెస్ట్‌ చేస్తారు. నేనేమైన రౌడీ షీటర్‌నా అని ఎదురు ప్రశ్నిచారు. దొంగ ఎఫ్‌.ఐ ఆర్‌ లతో కేసులు చేస్తున్నారని, ఎఫ్‌.ఐ.ఆర్‌ లు అతిగా ఉన్నాయని కోర్టులతో పోలీసు శాఖ చెప్పే పరిస్థితి ఏర్పడిరదని అన్నారు.

ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ పై అరవింద్‌ సెటైర్‌ వేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కవిత ఎంపీగా ఉన్న సమయంలో 54 వేల మందికి స్వయం ఉపాధి కింద కేంద్రం ఋణాలిచ్చింది. నీ అయ్య ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో, ఎన్ని ఋణాలిచ్చారో, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలన్నారు. నువ్వేం ఘనకార్యం చేశావని నీకు ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చాడో ముందు సమాధానం చెప్పమన్నారు.

తెరాస పార్టీ కమ్యూనిస్టు పార్టీలతో కూడా చర్చలకు దిగజారిపోయిందని అన్నారు. ఇంకెంతమంది ఆత్మహత్య చేసుకోవాలో, ఎంత మంది జీవితాలను నాశనం చేస్తావ్‌ కేసీఆర్‌ సమాధానం ఇవ్వాలన్నారు. కెసిఆర్‌ చేసిన ధౌర్భాగ్య పాలనకు తలదించుకుని ఆయనే ఆత్మహత్య చేసుకోవాలని సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »