కామారెడ్డి, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణపై సోమవారం రెవిన్యూ, సర్వే ల్యాండ్, మున్సిపల్, పంచాయతీ అధికారులు, కళాశాల అధ్యాపకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమావేశమయ్యారు.
డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణకు స్థలాల చుట్టూ తక్షణమే కందకాలు తవ్వించాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారులు, సర్వే ల్యాండ్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూములను కాపాడాలని పేర్కొన్నారు. సమావేశంలో ఇంచార్జ్ ఆర్‌డిఓ శీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపాల్ రాజకుమార్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, జిల్లా సర్వే ల్యాండ్ ఏ.డి.శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ వీర నంద్, డిఈ మురళి, అధికారులు పాల్గొన్నారు.