బాన్సువాడ, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం క్యాంప్ గ్రామంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు.
బోర్లం క్యాంప్ గ్రామస్థుల అభ్యర్థన మేరకు తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డిఎఫ్) నిధుల ద్వారా బోర్లం క్యాంప్ నుంచి నర్సాపూర్ కెనాల్ వరకు గ్రావెల్ రోడ్ 10 లక్షలు, బోర్లం క్యాంప్ నుంచి గురుకుల పాఠశాల వరకు 13 లక్షల రూపాయల సీసీ రోడ్డు, గురుకుల పాఠశాల సెక్యూరిటీ గార్డు రూమ్‌కి 3 లక్షల రూపాయలు, పాఠశాలలో కోతుల బెడద ఉండడం వలన ఇనుప గ్రిల్స్ ఏర్పాటుకై 3 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ఈ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ మండల పార్టీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్, బాన్సువాడ మండల పార్టీ కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, బాన్సువాడ సొసైటీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి, బుడ్మి సొసైటి ఛైర్మెన్ పిట్ల శ్రీధర్, బోర్లం క్యాంప్ సర్పంచ్ పీర్య నాయక్, మండల నాయకులు దొడ్ల వెంకట్ రాం రెడ్డి, గోపాల్ రెడ్డి, రతన్, శ్రీనివాస్ రెడ్డి,దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.