2 జూన్ 2020
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుసగా ఆరంభ భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ చివరకు సెన్సెక్స్ 34100కు ఎగువన, నిఫ్టీ 10వేల స్థాయికి ఎగువన ముగియడం విశేషం. సెన్సెక్స్ 284 పాయింట్ల లాభంతో 34109 వద్ద, నిఫ్టీ 82పాయింట్లు ఎగిసి 10061 ముగిసింది. బ్యాంకింగ్, ఆటో ఎఫ్‌ఎంసీజీ, ఫార్మాషేర్ల లాభాలు దలాల్ స్ట్రీట్ ర్యాలీకి మద్దతునిచ్చాయి. మరోవైపు మెటల్, ఐటీ స్వల్పంగా నష్టపోయాయి.ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ నెస్లే భారీ లాభాలను ఆర్జించగా ఎన్ టీపీసీ, భారతి ఇన్ఫ్రాటెల్, విప్రో, జీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ఇండ్ నష్ట పోయాయి.