అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అశోక్‌ గౌడ్‌

నిజామాబాద్‌, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల సమితి అధ్యక్షులుగా అబ్బ గోని అశోక్‌ గౌడ్‌కి తెలంగాణ అంతర్జాతీయ మానవ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు కుమార్‌ మహేంద్ర హైదరాబాదు ప్రధాన కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా అబ్బగోని అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ మానవ హక్కుల కోసం ఎల్లవేళల కృషి చేస్తానని, సామాన్య ప్రజలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు. (ఐహెచ్‌ఆర్‌సి) ఇంటర్నేషనల్‌ హుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ తరఫున సామాన్య ప్రజలకు ఏ ఆపద సమయంలోనైనా ముందుంటానని పేర్కొన్నారు.

తనను గుర్తించి అవకాశం ఇచ్చిన అంతర్జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కుమార్‌ మహేంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కురుమన్న, రాజు, రాజలింగం, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »