కామారెడ్డి, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం గండివేట్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామం పనులను మూడు రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.
మంగళవారం ఆయన వైకుంఠధామం పనులను పరిశీలించారు. మూడు రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచ్, పాలకవర్గం సభ్యులకు సూచించారు. సదాశివనగర్ మండలం ధర్మరావు పేటలో ఉన్న వైకుంఠధామం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సర్పంచ్ భాస్కర్ రెడ్డికి తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.