కామారెడ్డి, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాలలో 100 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటల వరకు గ్రామాల్లో ఉండాలని సూచించారు.
పల్లె ప్రకృతి యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలని కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని సూచించారు. 100 శాతం వ్యాక్సినేషన్ గ్రామాల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు.
వైకుంఠ ధామాలు వినియోగించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇంచార్జ్ పంచాయతీ అధికారి రాజేంద్ర ప్రసాద్, జడ్పీ సీఈవో సాయాగౌడ్ పాల్గొన్నారు.