25 లోగా ఓటరు కిట్‌ అందజేయాలి…

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి, ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డు ఎపిక్‌ కార్డులు బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ జిల్లా కలెక్టర్‌లను కోరారు.

బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్‌ కార్డుల పంపిణీ, తదితర విషయాలపై సూచనలు చేస్తూ, ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్‌ కిట్‌ కూడా జాతీయ ఓటర్‌ దినోత్సవం వచ్చే జనవరి 25 లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందచేయాలని తెలిపారు.

ఓటర్‌ కిట్‌లో వ్యక్తిగత లేఖ, ఓటర్‌ గైడ్‌, ఓటర్‌ ప్రతిజ్ఞ, ఎపిక్‌ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్‌ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సంవత్సరాలు నిండి ఓటర్‌ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »