నిజామాబాద్, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్, దుర్గవాహిని ఆధ్వర్యంలో ముగ్గులపోటి నిర్వహించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు.
భారతీయ సంస్కృతులూ, సంప్రదాయాల ముఖ్య ఉదేశ్యంతో పోటీ నిర్వహించామని, పిల్లలు, పెద్దలు, మహిళలు కరోనా నిబంధనలు పాటిస్తు, ఆహ్లాదకరమైన వాతావరణం లో పోటీ జరిగిందని దుర్గావాహిని జిల్లా సహ సంయోజనీ నాంచారి రaాన్సీ తెలిపారు.
ముఖ్య అతిథిగా ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా ఇన్‌చార్జి అనుపమ సుబేధార్, సేవికా సమితి జిల్లా ఇన్‌చార్జి కందకుర్తి రాజశ్రీ, హిందూవాహిని కార్యకర్త మేఘనా బిడే, ఉపాధ్యాయురాలు ఉమా పాల్గొన్నారు.
పోటీల అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. జిల్లా సహ సంయోజనీ రaాన్సీ నాంచారి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు బయటకి రావాలి, వారి కాళ్ళమీద వారు నిలబడాలని, ఆడపిల్లలు తమని తాము కాపాడుకోవాలని అన్నారు. అనుపమ సుబేధార్ పిల్లల్ని ఉదేశించి మాట్లాడారు. పిల్లలు చిన్న వయసునుండే క్రమశిక్షణతో ఉండాలని చెప్పారు.