కామారెడ్డి, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డిఎస్ఆర్ ఫౌండేషన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం క్యాసంపల్లీ వృద్ధాశ్రమంలో శారదా దేవి ఫౌండర్ ఆధ్వర్యంలో 30మంది వృద్ధులకు స్వెటర్లు, బ్లాంకెట్లు, 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
కార్యక్రమంలో డిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జడల రజనీకాంత్, బిసి సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు రాజ్ కుమార్, నాయకులు అఖిల్ రావు, రాజు, స్వామి పాల్గొన్నారు.