డిచ్‌పల్లి, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల సిబిసిఎస్ పాఠ్య ప్రణాళికకు అనుగుణమైన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, రెండవ సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 24 వ తేదీ వరకు రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
రీవాల్యూయేషన్‌కు పేపర్ ఒక్కింటికి చొప్పున రూ. 500, రీ కౌంటింగ్‌కు పేపర్ ఒక్కింటికి చొప్పున రూ. 300, అప్లికేషన్ ఫారానికి రూ. 25 చొప్పున చెల్లించాలని ఆమె పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.