కామారెడ్డి, జనవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బిక్కనూర్ వాస్తవ్యుడు గడ్డం మల్లేష్ సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు.
కామారెడ్డి జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఎంపీడీవో, ఏపీవోల సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. కొత్తగా సైబర్ నేరాలు జరుగుతున్న తీరును, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 155260 కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సైబర్ క్రైమ్.జివోవి.ఇన్ పోర్టల్ గురించి వివరించారు. క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.