కామారెడ్డి, జనవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన ఎరువుల ధరలు తగ్గించే వరకు రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు మారే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు.
గత రెండు ఏళ్లలో డిఎపి పై 819, పొటాష్ పై 1050, బిస్బిస్ పై 515, 28బి28 పై 770 రూపాయల ధర పెంచిందన్నారు. సమావేశంలో ఎంపిపి పిప్పిరి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిదులు బల్వంత్ రావు, గైనీ శ్రీను, నాయకులు పిప్పీరి వెంకటి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కుంబాల రవి, కృష్ణాజి రావు, ఆనంద్, లక్ష్మినారాయణ, అమ్జద్, రవీందర్, కాసర్ల స్వామి తదితరులున్నారు.