నిజామాబాద్, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడొచ్చని సూచించారు.