జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పోటీలు

కామారెడ్డి, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌, షార్ట్‌ ఫిలిం పోటీలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆన్‌ లైన్‌ ద్వారా పోటీలు నిర్వహించే విధంగా చూడాలని కోరారు. విజేతలకు కళాశాలల స్థాయిలో బహుమతులను ప్రదానం చేయాలని పేర్కొన్నారు.

కొత్త ఓటర్లకు కిట్లను పంపిణీ చేయాలని కోరారు. మాచారెడ్డి, గాంధారి, నిజాంసాగర్‌, లింగంపేట మండలాల్లో రేపటి నుంచి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా తనిఖీ బృందాలు పర్యటిస్తాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం, గ్రామీణ సడక్‌ యోజన పథకం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లను బృందం సభ్యులు పరిశీలన చేస్తారని చెప్పారు.

ఉపాధి హామీకి సంబంధించిన ఏడు రిజిస్టర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పని చేసిన చోట వర్క్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటికలు వినియోగంలో ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డివో శీను, జిల్లా పరిషత్‌ సీఈవో సాయా గౌడ్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »