బోధన్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని దేవిగల్లీలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కామ్రేడ్ వినోద ప్రథమ వర్ధంతి నిర్వహించారు. సభలో జిల్లా ఉపాధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ కామ్రేడ్ వినోద కల్లాకపటం లేని మనిషి అని కొనియాడారు. ఆమె ఇంటికి ఎవరు వెళ్ళినా నవ్వుతూ మాట్లాడేదని, ప్రేమతో పలకరించేదని అన్నారు.
కామ్రేడ్ వినోద మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలకు వ్యతిరేకంగా, దోపిడీ వ్యతిరేకంగా మహిళా సంఘం ఇచ్చిన పిలుపుల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. అదేవిధంగా పురుషాధిక్య సమాజంలో పురుషుల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడారని వివరించారు. ఆమె ఆశయాల సాధానకై వాటిని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకురాలు భారతక్క, రెహన, శాంతక్క, గంగామణి. బోరెక్క, వీరమణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.