రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ నెల 8వ తేది నుంచి వాటిని తిప్పడానికి అనుమతి లభించినట్టు సమాచారం. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సిటీ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరుచ అయితే, ప్రజా రవాణా సంస్థ అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Check Also
లక్షకు చేరువలో….
Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …