డిచ్‌పల్లి, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పలువురు అధ్యాపకులు పాలనా పరమైన బాధ్యతలలో నియామకం పొందారు. వైస్ చాన్స్‌లర్ చాంబర్ లో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా మంగళవారం అధ్యాపకులు నియామక పత్రాలను పొందారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా. వాసం చంద్రశేఖర్ ఐక్యూఎసి డైరెక్టర్‌గా నియామకం పొందారు. ఆయన ఇదివరకు తెలంగాణ విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులుగా, యూజీసీ సెల్ కో ఆర్డినేటర్‌గా, పర్మాస్యూటికల్ కెమిస్ట్రీకి విభాగాధిపతిగా, బిఓఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2020 లో తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని పొందారు. ప్రస్తుతం నాక్ డ్రాఫ్ట్ కమిటీ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా. సిహెచ్. ఆంజనేయులు యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా నియామకం పొందారు. ఆయన ఇదివరకు తెలంగాణ విశ్వవిద్యాలయ మొట్ట మొదటి కంట్రోలర్‌గా, విశ్వవిద్యాలయ కళాశాలకు, హాస్టల్స్‌కు వైస్ ప్రిన్సిపల్‌గా, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్‌గా, ఇంటర్ ప్రిన్యూనర్ షిప్ డైరెక్టర్‌గా, ఎం.బి.ఎ.కు విభాగాధిపతిగా, బిఓఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఇంటర్ ప్రిన్యూనర్ షిప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. రాంబాబు స్పోర్ట్స్, గేమ్స్ అండ్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా నియామకం పొందారు. ఆయన ఇదివరకు విశ్వవిద్యాలయ కళాశాలకు మరియు హాస్టల్స్‌కు వైస్ ప్రిన్సిపల్‌గా, బాలుర వసతి గృహానికి వార్డెన్‌గా, అసిస్టెంట్ కంట్రోలర్ పీజీ సెక్షన్ కాంఫిడెన్షియల్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కామర్స్‌కు విభాగాధిపతిగా, బిఓఎస్ చైర్మన్‌గా, గవర్నర్ ఆఫీస్ విత్ అలుమిని నోడల్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శాంతాబాయి ఇంఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్ వర్క్, వెబ్ కౌన్సెలింగ్ డైరెక్టర్‌గా నియామకం పొందారు. ఆమె ఇదివరకు ఎస్సి, ఎస్టి సెల్ డైరెక్టర్‌గా, బాలికల వసతి గృహానికి వార్డెన్‌గా, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా, అలుమిని సెల్ డైరెక్టర్‌గా, మాస్ కమ్యూనికేషన్‌కు విభాగాధిపతిగా, బిఓఎస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ కళాశాల వైస్బ్ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు ప్రొఫెసర్ ఆచార్య కైసర్ మహ్మద్ సిడిసి డీన్‌గా నియామకం పొందారు. ఆమె ఇదివరకు ఐక్యూఎసి డైరెక్టర్‌గా రెండు పర్యాయాలు, ప్లేస్ మెంట్ సెల్ డైరెక్టర్‌గా, ఇంఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్ వర్క్, వెబ్ కౌన్సెలింగ్ డైరెక్టర్‌గా, కామ్స్ర్, బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలకు ప్రిన్సిపల్‌గా, బి.ఎడ్. కాలేజ్ సారంగపూత్ క్యాంపస్‌కు ప్రిన్సిపల్‌గా, ఎం.బి.ఎ.కు విభాగాధిపతిగా, బిఓఎస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
తమపై అత్యంత నమ్మకంతో పలు పాలనా పదవుల్లో నియమించినందుకు అధ్యాపకులు ఉపకులపతి, రిజిస్ట్రార్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వారందరికి అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.