బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు

కామారెడ్డి, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండేళ్ళ క్రితం బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తు మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి….

రెండు సంవత్సరాల క్రితం 7వ తేదీ ఆగష్టు 2020 రోజున నిందితుడు విభూతి సాయిలు బీబీపేట్‌ మండలానికి చెందిన 10 సంవత్సరాల చిన్న పిల్లవాడిని బీబీపేట్‌ గ్రామ శివారులో, బీరప్ప గుడి వద్ద గల బొల్లని కుంట సమీపములోనికి తీసుకుని పోయి భయపెట్టి అతనిని ప్రకృతికి విరుద్దముగా బలవంతము చేసి మొలత్రాడుతో పిల్లవాణి మెడకు బిగించి చంపివేసి అట్టి కుంటలో పడవేశాడు.

ఇట్టి విషయంలో మృతుడు తల్లి అయిన పంపరి రేణుఖ ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐపి జే. మహేందర్‌ ముందుగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు అయిన విభూతి సాయిలు (22) ని అరెస్టు చేసి పూర్తి విచారణలో ఈ కేసు హత్య మరియు పోక్సో చట్టం క్రింద చార్జ్‌ షీట్‌ వేశారు.

నిజామాబాద్‌ 2వ అదనపు జిల్లా కోర్ట్‌ న్యాయమూర్తి పంచాక్షరీ సాక్షులను విచారించి, ఆధారాలను పరిశీలించి చివరగా నిందితుడిపై నేరం రుజువు అయిందని జీవిత ఖైదీ కారాగార శిక్ష, అలాగే 1000 రూపాయల జరిమాన విధించారు.

నేరం రుజువు కావడంలో సక్రమ పద్దతిలో పరిశోదన చేసిన అధికారులు ఎం. సోమనాథం, టి. లక్ష్మినారాయణ డిఎస్‌పి కామారెడ్డి, డి. యాలాద్రి, సిఐపి భిక్కనూరు, ఎస్‌ఐపి జే మహేందర్‌ బీబీపేట పి.యస్‌, అదేవిదముగా కోర్టులో పోలీసు తరపున వాదించిన అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవి రాజ్‌, సాక్షులను కోర్ట్‌ యందు హాజరు పరుచుటలో లైసన్‌ ఆఫీసర్‌ ఎస్‌. హన్మండ్లు, కోర్ట్‌ డ్యూటి ఆఫీసర్‌ సి.హెచ్‌. రజనికాంత్‌లను కామారెడ్డి జిల్లా పోలీసు అధికారి అభినందించారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయం…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »