రాంపూర్‌లో సిసి కెమెరాల ఏర్పాటు …

డిచ్‌పల్లి, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం 18వ తేదీ నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కె.ఆర్‌. నాగరాజు ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళాబృందం వారి ఆధ్వర్యంలో డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామ్‌పూర్‌ గ్రామ ప్రజలు 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్‌ కళా బృందం పలు అంశాలపై అవగాహన కల్పించారు.

సీసీ కెమెరాల ఆవశ్యకత వివరిస్తూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని, సీసీ కెమెరాలు వల్ల నేరాలను అరికట్టవచ్చు అని వివరించి, ప్రజలందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సిసి కెమెరాలను ఎవరు పాడు చేయవద్దని, మూఢనమ్మాలను నమ్మవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్‌ తీసుకొవాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని తెలిపారు. మాస్క్‌ లేని ప్రయాణం సురక్షితం కాదన్నారు.

మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించి, గ్రామంలోని యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఆన్‌లైన్‌ మోసాల గురించి వివరించి ఎవరైనా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయినప్పుడు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 155260 లేదా డయల్‌ 100 కి కాల్‌ చేసి ఫిర్యాదు ఇవ్వాలని తెలిపారు. ట్రాఫిక్‌ నియమాలు గురించి వివరించి, హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలని, సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ బండి నడపరాదని వివరించారు.

డయల్‌ 100 గురించి వివరించి అత్యవసరసమయంలో డయల్‌ 100 ఉపయోగించాలని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఏసిపి వెంకటేశ్వర్లు, డిచ్‌పల్లి సిఐ రఘునాథ్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కళాబృందం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »