కామారెడ్డి, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లు యజమానులతో మార్చి 15 లోపు యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం పూర్తి చేయిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్తో టెలికాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ప్రతిరోజు లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లు యజమానులు మిల్లింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని రైస్ మిల్లను ఉప తహసీల్దార్లు పర్యవేక్షణ చేసే విధంగా చూస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజు మిల్లింగ్ చేసిన వివరాలను రికార్డులో నమోదు చేయిస్తామన్నారు.
టెలీ కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా ఇంచార్జ్ సివిల్ సప్లై అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.