హైదరాబాద్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికై బుధవారం శాసనమండలిలో సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు.
శాసనమండలి భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ్యులతో కలిసి పాల్గొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి రెండవసారి ఎంఎల్‌సిగా ఎన్నికై శాసనమండలిలో సభ్యురాలైన సందర్భంగా కవితకు పుష్ప గుచ్ఛం అందించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.