కామారెడ్డి, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చట్టం 1920 ( సవరించబడిన చట్టం 22 / 1956 మరియు చట్టం యొక్క అనుసరణ (నెం.4) ఉత్తర్వులు 1957 మరియు చట్టం నెంబర్,14 / 1992) సెక్షన్ 5 లోని అధికారము మేరకు మండల స్థాయి మేనేజింగ్ కమిటీ, డివిజన్ స్థాయి మేనేజింగ్ కమిటీ, జిల్లా స్థాయి మేనేజింగ్ కమిటీ ఎంపిక కొరకు నేడు (ఈ నెల 20 వ తేదీన) కామారెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల నోటికిేషన్ విడుదల చేస్తామనీ కలెక్టర్, ఐఆర్సిఎస్ కామారెడ్డి జిల్లా బ్రాంచ్ అధ్యక్షులు జితేశ్ వి పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.