పివైఎల్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు

డిచ్‌పల్లి, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతి శీల యువజన సంఘం పివైఎల్‌ యువనోద్యమ నాయకుడు జిల్లా తొలి కన్వీనర్‌ కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌ కుమార్‌ 30 స్మారక వర్ధంతి సందర్భంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామంలో జనవరి 30, 31 తేదీల్లో రెండురోజుల పాటు జిల్లా స్థాయి క్యారం, చెస్‌, షటిల్‌, సైక్లింగ్‌, బీడీ కార్మికులకు బీడీలు చుట్టుట వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్టు పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు సాయినాథ్‌ తెలిపారు.

జిల్లాలోని క్రీడాకారులు అందరూ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పివైఎల్‌ అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహించిందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకై, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల రోగాలకు సరిపడ వైద్యులను నియమించాలని పోరాడిరదన్నారు. ఇంకా అనేక సమస్యలపై పోరాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించాలని క్రమం తప్పకుండా అమర వీరుల వర్ధంతి సందర్భంగా క్రీడాకారుల నైపుణ్యత వెలికి తీయాలని పివైఎల్‌ క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో నర్సయ్య, దేవసమీ, సత్యం, భాస్కర్‌, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »