ఆర్మూర్, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో గల ఎస్.ఎస్.కే సమాజ్ లక్ష్మీనారాయణ మందిరంలో యువజన సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ పేద 80 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేసినట్టు యువజన సమాజ్ అధ్యక్షులు జీ.వి. ప్రశాంత్, కార్యదర్శి విశ్వనాథ్, శ్రీను, రాజేష్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల మాదిరిగానే క్షత్రియ పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిత్యవసర వస్తువులు అందజేశామన్నారు. కార్యక్రమంలో కోశాధికారి కర్తన్, విశాల్ కుమార్, సంయుక్త కార్యదర్శి విద్యాసాగర్, దొండి సాయి, విద్యా కార్యదర్శి వాగ్లే దత్తాద్రి, వ్యాయమ కార్యదర్శి జి.పి.శ్రీకర్, పోహార్ కిరణ్, చౌల్ రామ్ రాజ్, బచ్చేవాల్ సతీష్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.