కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, జనవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్‌, మాచారెడ్డి, రామారెడ్డి మండలాలకు చెందిన 258 మందికి 2 కోట్ల 58 లక్షల 29 వేల 928 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 5 వేల 925 మందికి 58 కోట్ల 92 లక్షల 54 వేల 980 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లను మగ పిల్లవానితో సమానంగా పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆడపిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »