అంబులెన్స్‌ను ప్రారంభించిన మంత్రి

నిజామాబాద్‌, జనవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా జనరల్‌ ఆసుపత్రికి ప్రభుత్వం కేటాయించిన అధునాతన అంబులెన్స్‌ను శనివారం కలెక్టరేట్‌ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంబులెన్స్‌ను రోగుల సౌకర్యం కోసం హ్యూందాయ్‌ కంపెనీ ప్రభుత్వానికి వితరణ చేయడంతో, ప్రభుత్వం దానిని నిజామాబాద్‌ జీజీహెచ్‌కు కేటాయించిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు.

అంబులెన్స్‌లో వెంటిలేటర్‌తో పాటు మానిటర్‌, స్ట్రెచర్‌, వీల్‌ చైర్‌, ఏసీ, సెంట్రల్‌ ఆక్సీజన్‌ కనెక్షన్‌ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ డీ.విఠల్‌ రావు, అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ నారాయణ రెడ్డి, వైద్యులు సరస్వతి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.త

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »