కామారెడ్డి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల రక్ష వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జెండా ఊపి బాలరక్షక భవన్ వాహనాన్ని ప్రారంభించారు. సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి ప్రభుత్వం బాల రక్ష వాహనం ఏర్పాటు చేయడం జరిగిందని నవంబర్ 14 న రాష్ట్రం మొత్తం 33 వాహనాలను సిఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా అన్ని జిల్లాలకు కేటాయించారన్నారు.
ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకి కూడా వాహనాన్ని కేటాయించడం జరిగిందని, పిల్లలు ఎక్కడ కనబడిన ఆపదలో ఉన్న పిల్లలు భిక్షాటన చేస్తున్న పిల్లలు, బడి బయట ఉన్న పిల్లలను అలాగే స్కూల్ డ్రాప్ అవుట్, శరీర హింసకు గురవుతున్న పిల్లలు, హాస్టల్ వసతి కావాలనుకున్న పిల్లలు కనిపిస్తే హెల్ప్‌లైన్ 1098 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. వాహనంలో సంబంధిత అధికారులు వచ్చి పిల్లల రక్షణ, సంరక్షణ చూసుకుంటారని అన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, జడ్పి ఛైర్మన్ దఫేదార్ శోభ, డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎస్‌పి శ్రీనివాస్, సంక్షేమ అధికారి సరస్వతి, సిడబ్ల్యుసి ఛైర్‌పర్సన్ సత్యనారాయణ, సిడబ్ల్యుసి మెంబర్ సరస్వతి, వైస్ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ, బాలరక్షక్ కో ఆర్డినేటర్ జానకి, డిసిపివో స్రవంతి, ఐసిపిఎస్ స్టాఫ్ ఛైల్డ్‌లైన్ 1098 కో ఆర్డినేటర్ రజిత పాల్గొన్నారు.