వేల్పూర్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగావేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో పకడ్బందీగా నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహించాలని థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరోణ పాజిటివ్ బాధితులు నిబంధనలు తప్పకుండా పాటించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు.
వేల్పూర్ మండలంలో డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే పడగల గ్రామంలో పరిశీలించామని, బాధితుల ఇంటింటికి తిరుగుతూ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.
పడగల గ్రామంలో ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో తహసిల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీపీ, జడ్పిటిసి భారతి డాక్టర్ అశోక్, డాక్టర్ ప్రత్యూష, వైద్య సిబ్బంది, జిల్లాస్థాయి అధికారులు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.