కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

అయితే ప్రజల సౌకర్యార్థం, వారి సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా డ్రాప్‌ బాక్స్‌ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు తమ అర్జీలు, ఫిర్యాదులను డ్రాప్‌ బాక్స్‌లో వేస్తే, వాటిని సంబంధిత శాఖల అధికారులకు చేరవేసి సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్‌ భరోసా కల్పించారు. జిల్లా ప్రజలు పై విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, కరోనా వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలని కోరారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »