కామారెడ్డి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. జాతీయ జెండా ఏర్పాటు చేయవలసిన స్థలాన్ని చూశారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు.