కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట కమిటీ బొక్కల వేణుని నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఇంఛార్జిగా నియమిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సురేష్ డానియల్ నేలపాటిని జిల్లా ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్లు మంగళవారం సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర కమిటీ తెలిపింది.
ఈ సందర్భంగా నూతన ఉమ్మడి జిల్లా ఇంఛార్జి వేణు, కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులు సురేష్ డానియల్ నెలపాటీ మాట్లాడుతూ సమాజానికి తమ వంతుగా అవినీతి చేసే అధికారులను ప్రశ్నిస్తూ తగిన చర్యలు తీసుకునే విధంగా, ప్రజలకు అందుబాటులో వుంటు ప్రజా సమస్యలను తక్షణమే తీర్చే విధంగా జిల్లా ఇంఛార్జి, కన్వీనర్లతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పారు.