కామారెడ్డి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పునరంకితం కావాలనీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి ఐడిఓసిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం 2022 సంవత్సరం డైరీ, క్యాలెండర్‌లను బుధవారం ఆవిష్కరించారు.
జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా అధికారుల సంక్షేమ సంఘం తొలిసారిగా డైరీ, క్యాలెండర్‌లను వెలువరించడం అభినందనీయం అన్నారు. కృషి చేసిన డోవా అధ్యక్షులు ఆర్ రాజారాం, కార్యవర్గ సభ్యులు, సహకరించిన జిల్లా అధికారులను విప్, జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లా అభివృద్ధికి అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారనీ అన్నారు. ఫలితంగా అనేక అంశాల్లో జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో జిల్లా సమగ్రాభివృద్ధి ధ్యేయంగా అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, క్షేత్ర సిబ్బంది కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డోవా గౌరవ అధ్యక్షులు డి వెంకట్ మాధవ రావు, అధ్యక్షులు ఆర్ రాజారాం, ఉపాధ్యక్షులు జె భాగ్యలక్ష్మి, డి సంజీవ రావు, సంయుక్త కార్యదర్శులు యం. సరస్వతి, జితేంద్ర ప్రసాద్, ఎన్ వాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎస్ రాజు, బి. వీరానంద రావు, డి సాయ గౌడ్, ప్రచార కార్యదర్శి మామిండ్ల దశరథ, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శి వై దామోదర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.