ఎల్లారెడ్డి, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం గొల్లపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర పరిశుభ్రత పాటించాలని, గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు చెట్లను చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా వేయడం జరుగుతుందని, గ్రామ సమస్యలను పై అధికారులకు తీసుకువెళ్తానని అన్నారు.
సెక్రెటరీ జనార్దన్ గ్రామ పంచాయతీ ఆదాయ ఖర్చులు చదివి వినిపించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సయ్య, వార్డు సభ్యులు రాజయ్య, మల్లయ్య, అంజయ్య గ్రామ స్కూల్ టీచర్ గణేష్, అంగన్వాడీ టీచర్ జ్యోతి, డ్వాక్రా మహిళ సంఘ సీసీ, ఆశ వర్కర్ లక్ష్మీ, మహిళ సంఘ అధ్యక్షురాలు సుశీల, విఆర్ఏ నర్సింలు, జిపి సిబ్బంది సురేందర్, జోగు బాబామ్మ, లెష్మిరాజం, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.