కామారెడ్డి, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల చెత్తను టిప్పర్ల ద్వారా తొలగించాలని సూచించారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని కోరారు. ప్రతి ప్లాటుకు క్రమ సంఖ్య కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.