దొంగ అరెస్ట్‌, రిమాండ్‌

కామారెడ్డి, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు విచారించగా భయపడి చేసిన దొంగతనం ఒప్పుకోగా అసలు విషయం బయటపడిరది. గతంలో జరిగిన దొంగతనం కేసులో పోయిన సొత్తు రికవరీ అయినట్లు డిఎస్పీ సోమనాదం తెలిపారు.

రాజంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న అరగొండ గ్రామానికి చెందిన చాకలి ఎల్లయ్య ఇంట్లో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఇట్టి విషయంలో ఫిర్యాదు తీసుకొని కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఎల్లయ్యకు చెందిన బంగారంతో పాటు నగదు, దొంగనుండి అరతులం బంగారం, పదివేల రూపాయలు రికవరీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో సిఐ తిరుపతయ్య, ఎస్‌ఐ రాజు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »