కామారెడ్డి, జనవరి 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని సూచించారు.
పేద ప్రజలకు సేవలు అందించడంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు ముందుండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాలకతీతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకుని రక్తదాన శిబిరాలు విజయవంతం అయ్యే విధంగా చూడాలన్నారు.
జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న మాట్లాడారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గత నాలుగేళ్లలో చేపట్టిన రక్తదాన, వైద్య శిబిరాల వివరాలను తెలిపారు. జిల్లాలో నాలుగు వేలకు పైగా సభ్యత్వ నమోదు చేశామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా చీప్ ప్లానింగ్ అధికారి రాజారామ్, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.