భీమ్గల్, జనవరి 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణకేంద్రంలో దక్షిణ బద్రీనాథ్గా పేరుగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారిని శనివారం తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కార్పొరేషన్ మహిళ చైర్ పర్సన్, మాజీ ఎంఎల్సి ఆకుల లలిత వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు నంబి వంశస్థులు సంప్రదాయ బద్దంగా స్వామి వారి శేషవస్త్రంతో ఆహ్వానించి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదం, భోజనాలు చేయించారు.
లింబాద్రి గుట్టకి 3.30 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు, గిరి ప్రదక్షణ రోడ్డు వేయించిన మినిష్టర్ వేముల ప్రశాంత్ రెడ్డికి ఆకుల లలిత ధన్యవాదాలు తెలిపారు. అలాగే శనివారం రోజు కావడం, విద్యా సంస్థలు సెలవులు ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. జిల్లా నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అన్నదాన కమిటీ అద్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.