నిజామాబాద్, జనవరి 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వ్యాప్తి దృష్ట్యా, ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడమయ్యిందని కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడిరచారు.
అయితే ప్రజల సౌకర్యార్థం, వారి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ఇప్పటికే డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేశామని, ప్రజలు దానిని వినియోగించుకోవాలని సూచించారు. డ్రాప్ బాక్స్‌లో వేసే అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు చేరవేసి సకాలంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు పై విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.